
కుత్భుల్లాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన ఉన్న అరుంధతి ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపు గోడౌన్ లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. షాపులోంచి దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read :- మంత్రి సబితా గన్మెన్ ఆత్మహత్య
ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకు ఫైర్ సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఆస్థినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఒక్కసారిగా మంటలు ఎగిసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ వచ్చారు.