
కోరుట్ల, వెలుగు: కథలాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగి పీహెచ్‌సీలో టీకాలు భద్రపరచే గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఐఎల్ఆర్ (ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్) , రెండు డీప్ ఫ్రీజర్స్, వ్యాక్సిన్ క్యారియర్లు, ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 25 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.