కోల్ కతాలోని ఓ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

కోల్ కతాలోని ఓ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

కోల్ కతా లోని ఓ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం మద్యాహ్నం కళకత్తా లోని సాటిలైట్ టౌన్ షిప్, సాల్ట్ లేక్ లో ఉన్న బైసాఖి షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ బిల్డింగ్ ఐదు ఫ్లోర్లను కలిగి ఉంది. ఇందులో మధ్య ఫ్లోర్లలో మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించింది. ప్రస్తుతం మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ ఘటనలో ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా లేరా అని ఇప్పుడే చెప్పలేమని చెప్పారు పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.