కెమికల్‌‌‌‌ ఫ్యాక్టరీలో మంటలు..సిటీ అంతా పొగ

కెమికల్‌‌‌‌ ఫ్యాక్టరీలో  మంటలు..సిటీ అంతా పొగ

ఫ్రాన్స్‌‌‌‌: నార్త్‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌లోని రూయెన్‌‌‌‌ సిటీలో హానికర కెమికల్స్‌‌‌‌ తయారు చేసే ఫ్యాక్టరీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రూయెన్‌‌‌‌ సిటీని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదకర వాయువులు రిలీజ్‌‌‌‌ అయ్యే చాన్స్‌‌‌‌ ఉండడంతో రెడ్‌‌‌‌ అలర్ట్‌‌‌‌ ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలకు లీవ్‌‌‌‌ ఇచ్చారు. ఎమర్జెన్సీ అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు సూచించారు. 200 మంది రెస్క్యూ టీం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆపరేషన్‌‌‌‌లో 60 ఫైరింజన్లు పాల్గొన్నాయి. ఫైర్‌‌‌‌ యాక్సిడెంట్‌‌‌‌ జరిగిన ఫ్యాక్టరీలో భారీగా ప్రమాదకర ఫ్యూయల్స్‌‌‌‌ ఉన్నట్టు సమాచారం. ‘ఈ ఫైర్‌‌‌‌ వల్ల పెద్దగా ప్రమాదం లేదనే అనుకుంటున్నాం. అయినా ముందస్తు చర్యలు తీసుకున్నాం. పొగ వల్ల రోజువారీ పనులకు ఇబ్బంది కలగొచ్చు. అందుకే స్కూళ్లు, కాలేజీలకు సెలవిచ్చాం’ అని మంత్రి క్రిస్టోపే కాస్టనీర్‌‌‌‌ వెల్లడించారు. రూయెన్‌‌‌‌లోని సీన్ రివర్‌‌‌‌ ఒడ్డున ఈ కెమికల్‌‌‌‌ ఫ్యాక్టరీ బిలియనీర్‌‌‌‌ వారెన్‌‌‌‌ బఫెట్‌‌‌‌కు చెందినది.