నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. బుధవారం (మే20) మధ్యాహ్నం ఉన్నట్టుండి స్టేషన్ ఆవరణలో ఒక్కసారి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి స్టేషన్ ఆవరణలో ఉంచిన సీజ్ చేసిన బైకులు, కార్లు కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు ఫైర్ సిబ్బంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పోలీస్ స్టేషన్ భవనానికి మంటలు అంటుకోకుండా నివారించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పొలాల్లో గడ్డిని తగలబెడుతుండగా మంటలు వ్యాపించి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.. పొలాల్లో మంటలు విస్తరించి పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసిన కార్లు, బైకులకు అంటుకున్నాయి. దీంతో సగానికిపైగా వాహనాలు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పోలీస్ స్టేషన్ భవనానికి మంటలు అంటుకోకుండా నివారించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
