మోర్ సూపర్ మార్కెట్లో ఎగసిపడ్డ మంటలు..

మోర్ సూపర్ మార్కెట్లో ఎగసిపడ్డ మంటలు..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.  గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ కు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగమంచు కప్పేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. 

 స్థానికులు సమాచారం  ఇవ్వడంతో  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది  మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది..  అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.