
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్ డిపో సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న కిరాణం, సెలూన్, పండ్ల దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పండ్ల దుకాణంలో పడుకున్న వ్యక్తి దోమల కోసం జెట్ కాయిల్ ముట్టిచ్చి నిద్రపోగా అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి వెంకటేశ్ తెలిపారు. 3 షాపులలో కలిసి సుమారుగా రూ. 3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. షాప్ ల పైనే ఆధారపడి జీవనాధారం కొనసాగిస్తున్నామని అలాంటిది అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయామని ఎమ్మెల్యే రోహిత్ రావు, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.