మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ లో ఇవాళ తెల్లవారుజామున  అగ్నిప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో ఉన్న  ఓ షాపులో మంటలు చెలరేగాయి. 4 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.  అయితే నష్టం ఎంత జరిగిందనేది ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.