పాకిస్తాన్‌ PMO ఆఫీసులో అగ్ని ప్రమాదం

పాకిస్తాన్‌ PMO ఆఫీసులో అగ్ని ప్రమాదం

పాకిస్తాన్‌ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ(సోమవారం)PMO ఆఫీసులోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. బిల్డింగ్‌లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. PM ఆఫీసు నుంచి ఉద్యోగులను తరలిస్తున్నారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్‌ ఆదేశాలు చేశారు.