నార్త్ కొరియాలో మొదటి కరోనా అనుమానిత కేసు.. లాక్డౌన్ ప్రకటించిన అధికారులు

నార్త్ కొరియాలో మొదటి కరోనా అనుమానిత కేసు.. లాక్డౌన్ ప్రకటించిన అధికారులు

కేసాంగ్ నగరంలో మొదటి కరోనా కేసు

కరోనా కేసులు ప్రపంచమంతా విస్తరించాయి. కానీ, ఇప్పటివరకు ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. తాజాగా అక్కడ ఒక్క అనుమానిత కేసు నమోదుకావడంతో ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. ఈ కేసు కన్ఫర్మ్ అయితే ఉత్తర కొరియాలో ఇదే మొదటి కరోనా కేసు. దక్షిణ కొరియాకు సరిహద్దు నగరమైన కైసాంగ్ లో ఈ కేసు నమోదు కావడంతో అక్కడి అధికారులు వెంటనే అప్రత్తమై లాక్డౌన్ విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. శనివారం కరోనా అనుమానిత కేసులు రావడంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ వెంటనే పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదైతే.. ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకినట్లుగా భావిస్తున్న వ్యక్తి మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు వెళ్లాడు. ఆ వ్యక్తి జూలై 19 అక్రమంగా ఉత్తర కొరియాలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారందరినీ నిర్బంధంలో ఉంచారు. తొలి కేసు నమోదు కావడంపై అధ్యక్షుడు కిమ్ స్పందించారు. ‘దేశంలోకి కరోనావైరస్ ప్రవేశించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. తొలి కేసు నమోదుకావడంతో ముందుజాగ్రత్తగా కేసాంగ్ నగరంలో లాక్డౌన్ ప్రకటించారు. ఇది ముందుముందు మరింత పెరగవచ్చు’ అని కిమ్ అన్నారు. ఉత్తర కొరియాకు పొరుగున ఉన్న చైనాలో వైరస్ వ్యాప్తి చెందడంతో.. ముందుగానే కొరియా తన సరిహద్దులను మూసివేసింది. అంతేకాకుండా.. రాకపోకలపై కఠినమైన ఆంక్షలను విధించింది. ఉత్తర కొరియా భాగస్వామ్య దేశమైన దక్షిణ కొరియాలో ప్రస్తుతం రోజుకు 40 నుండి 60 కేసులు నమోదు అవుతున్నాయి.

For More News..

హోంక్వారంటైన్ లో మంత్రి ఎర్రబెల్లి

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్