ముంబై ధారావిలో మొదటి కరోనా పాజిటివ్ కేసు

ముంబై ధారావిలో మొదటి కరోనా పాజిటివ్ కేసు

ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడ ముంబైలోని ధారావి. ఆ ప్రాంతంలో ఇవాళ మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ధారవి మురికి వాడలో నివసించే 56 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ముంబై మహానగరం నడిబొడ్డున ఉన్న ధారావిలో చిన్న చిన్న ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్‌ షాపులు, మురికి కాల్వలతో నిండి ఉంటుంది. ఈ మురికివాడలో దాదాపు 10 లక్షల మంది నివసిస్తుంటారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముఖ్యంగా పరిశుభ్రత లేక పోవడమేనని….వ్యక్తి గతంగా ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలనిక డాక్టర్లు పదే పదే చెబుతున్నారు.