ఇండియాలో ఫస్ట్ : బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే.. బుర్ర బాగా పని చేస్తుందా.. మంచి తెలివి వస్తుందా..

ఇండియాలో ఫస్ట్ : బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే.. బుర్ర బాగా పని చేస్తుందా.. మంచి తెలివి వస్తుందా..

శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రతి జబ్బుకు ఇదిగో ట్రీట్​మెంట్.. అదిగో మెడిసిన్​ అంటున్నారు వైద్యులు. ఇప్పటికే క్యాన్సర్ తదితర మహమ్మారులకు నివారణోపాయం కనుక్కున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో ఆపరేషన్​చేసి సక్సెస్​ అయ్యారు. అదే డిప్రెషన్​ సర్జరీ. భారత్​లో ఫస్ట్​టైం కుంగుబాటుకు(డిప్రెషన్) సర్జరీ చేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 26 ఏళ్లుగా  డిప్రెషన్ తో బాధ పడుతూ ఉండేవారు. దీంతో ముంబయిలోని జన్​లోక్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో ఆమెకు డీప్​ బ్రెయిన్​ స్టిములేషన్​ సర్జరీ చేశారు. ఇది సక్సెస్​ కావడంతో డాక్టర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2017లో మానసిక ఆరోగ్య చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో జరిగిన ఫస్ట్ డిప్రెషన్​ సర్జరీ ఇదే కావడం విశేషం. నాడీ వ్యవస్థలో లోపాల వల్ల వచ్చే వ్యాధులు నయం చేయడానికి ఈ సర్జరీ చేస్తారు.