రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘జైలర్’ లో ఫస్ట్ లుక్ గ్లింప్స్‌‌‌‌ విడుదల

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘జైలర్’ లో ఫస్ట్ లుక్ గ్లింప్స్‌‌‌‌ విడుదల

రజినీకాంత్ సినిమా వస్తోందంటే తమిళనాడులోనే కాదు.. ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్‌‌‌‌ వరకూ దేశమంతటా స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఆయన నుండి రాబోతున్న కొత్త చిత్రం  ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. సోమవారం రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. ‘జైలర్‌‌‌‌‌‌‌‌’ ముత్తువేల్ పాండ్యన్‌‌‌‌గా ఇందులో తలైవా నటిస్తున్నారు. ఫార్మల్ కాస్ట్యూమ్స్‌‌‌‌లో కనిపిస్తోన్న ఆయన చేతులు పైకి మడిచి, కళ్ల జోడు పెట్టుకుని ఎక్కడికో బయల్దేరుతున్నారు. చివర్లో పెద్ద కత్తిని తీశారు. 

మొత్తానికి టీజర్‌‌‌‌‌‌‌‌లో రజినీ పాత్ర గురించి ఎక్కువ డిటైల్స్ ఇవ్వనప్పటికీ, ఆయన ఓ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పోషిస్తోన్న విషయం మాత్రం అర్థమవుతోంది. రజనీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 169వ సినిమా. కన్నడ స్టార్‌‌‌‌ శివరాజ్‌‌‌‌ కుమార్, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ ఇతర పాత్రల్లో కనిపించ నున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌14న రిలీజ్‌‌‌‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రజినీకాంత్ 72వ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ‘బాబా’ సినిమాకు తమిళనాట సూపర్ రెస్పాన్స్ వస్తోంది.