
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'కింగ్'. ఇటీవల షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో భుజానికి తీవ్ర గాయమైంది. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న ఆయన ఇప్పడు మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ గా ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో ఒక అభిమాని తీసిన చిత్రం లీకైంది. ఇప్పుడు ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్స్ లో షారూఖ్ సరికొత్త లుక్ లో కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.
ఈ చిత్రంలో షారూఖ్ మెక్ డోనాల్డ్స్ అవుట్ లెట్ నుండి బయటకి వస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ కెమెరాలు, లైటింగ్స్ ఉన్నాయి. దీంతో అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోందని అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. షారూఖ్ తెల్లటి షర్ట్, బ్లాకర్ సన్ గ్లాసెస్, స్టైలిష్ గా ఉన్నారు. గ్రే హెయిర్ లుక్ లో కనిపించారు. బాద్షా లుక్ పై సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
షారుఖ్ లుక్ పై ఒక అభిమాని ఈ లుక్ చూస్తుంటే సిద్ధార్థ్ ఆనంద్ ఫెయిల్ అవ్వడు అనిపిస్తోంది. వైట్ ఫాక్స్ చాలా బాగుంది. ఈ గ్రే షేడ్ యాక్షన్ డ్రామా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. షార్ట్ హెయిర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని రాశారు. మరొక అభిమాని "షారుఖ్ ఈజ్ బ్యాక్!" అంటూ పోస్ట్ చేశారు. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ 'కొల్లాటెరల్' చిత్రంలో గ్రే హెయిర్ లుక్‌తో కనిపించినప్పుడు, ఇప్పుడు షారుఖ్ లుక్‌తో పోలుస్తూ అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
►ALSO READ | LokahChapter1 Box Office: వారం రోజులైన కుమ్మేస్తున్న మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ సూపర్ హిట్
అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం "ఇండియన్ మైఖేల్ బే" అయిన సిద్ధార్థ్ ఆనంద్ ఓవర్ హైప్‌తో సినిమాను పాడు చేయకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామంటూ పోస్ట్ చేశారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కావడంతో చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని అభిమానులు సలహా ఇస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులకు అపారమైన నమ్మకం ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'కింగ్' సినిమాకి మరింత బజ్ తీసుకువచ్చే విషయం ఏమిటంటే.. ఇందులో షారుఖ్ మొదటిసారిగా తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి తెరపంచుకోనున్నారు. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, సౌరభ్ శుక్లా, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మ, , రాఘవ్ జుయల్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ,, అనిల్ కపూర్ అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
MEGASTAR @iamsrk on the set of #King🥶🔥👑#ShahRukhKhan
— 𝙎𝙍𝙆𝙄𝘼𝙉.𝙃𝙀𝙍𝙀❤️🔥𓃵 (@SRKxKING) September 4, 2025
History in making 👑 pic.twitter.com/t0cd2LFYQr