Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్.. చరణ్ బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్.. చరణ్ బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Adwani) హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు సంవత్సరంన్నర క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అవడం పక్కన పెడితే కనీసం అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదని భాదపడుతున్నారు.

ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నారు అంటూ అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు కానీ, సాంగ్ మాత్రం విడుదల కాలేదు. ఇక అప్పటినుండి గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. తాజాగా వారి ఎదురుచూపులకి ఎండ్ కార్డు పడింది. తాజాగా గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం థమన్ సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖి గేమ్ ఛేంజర్ అప్డేట్ గురించి అడిగారు. దానికి సమాధానంగా థమన్ మట్లాడుతూ.. రామ్ చరణ్ కోసం ఒక సాంగ్ ను విడుదల చేయబోతున్నాం. అది కూడా ఆయన పుట్టినరోజు మార్చ్ 27న. అంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు థమన్. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు రామ్ చరణ్. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికి 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.