దేశంలోనే మొదటిసారి అత్యధిక కరోనా కేసులు

దేశంలోనే మొదటిసారి అత్యధిక కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 64,399 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దాంతో దేశంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 21,53,011కు చేరింది. వీటిలో 6,28,747 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బారినపడి ఇప్పటివరకు 14,80,885 మంది డిశ్చార్జ్ అయ్యారు. శనివారం కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 861గా నమోదయంది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 43,379కి చేరినట్లు కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 7,19,364 శాంపిళ్లు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దాంతో ఇప్పటివరకు పరీక్ష చేసిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 2.41 కోట్లకు చేరింది.

For More News..

విజయవాడలో కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

రాష్ట్రంలో మరో 1982 కరోనా కేసులు

సగం సంక్షేమ హాస్టళ్లు.. కిరాయి బిల్డింగుల్లోనే