మృగశిర కార్తె.. చేపల మార్కెట్లు కిటకిట.. ఎందుకంటే..

మృగశిర కార్తె.. చేపల మార్కెట్లు కిటకిట.. ఎందుకంటే..

మృగశిర కార్తె నేడు ఆరంభమైంది. దీంతో చేపలు తినాలని జనం ఎగబడుతున్నారు. ఎలాగైనా సరే మృగశిర కార్తెలో  రోజు మాంసాహారం తినాలని చూస్తుంటారు. ఇందులో భాగంగానే  అందరు చేపలనే తినాలని చూస్తారు. మృగశిర కార్తెలో  రోజు ఎక్కువగా చేపలు ఎందుకు తింటారు? ఇందులో ఉన్న రహస్యమేమిటి? అనే దానిపై అందరికి సందేహాలు ఉంటాయి. మృగశిర రోజు మాంసాహారం తినాలని చెబుతారు. కానీ ప్రజలు ఈ రోజు చేపలనే ఆహారంగా చేసుకుంటారు. మృగశిర కార్తె రోజు ఎందుకు చేపలు తింటారు. దాని వెనకున్న కారణాలు ఏమిటి?

మండే ఎండలతో అల్లాడిన జనం.. మృగశిర కార్తె రాగానే కాస్తా రిలాక్స్ అవుతారు. ఎందుకంటే మృగశిక కార్తె  వర్షాలకు సూచన. ఇది 15 రోజుల పాటు ఉంటుంది. ఈ మృగశిర కార్తె రోజున చేపలు తింటారు. ఎండాకాలం ఎండలు మృగశిర కార్తెతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. వాతావరణం చల్లబడుతుంది. అయితే మన శరీరం ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. కానీ, పూర్తిగా కాదు. దీంతో శరీరంలో వేడిని మెయింటెయిన్ చేసి ఆరోగ్య సమస్యలు రాకుండా చేపలు సహకరిస్తాయి. అందుకే మృగశిర ప్రారంభం రోజు నుంచే చేపలు తినేందుకు ఇష్టపడతారు.

సాధరణంగా వర్షాకాలం అంటేనే జలుబు, దగ్గు, జ్వరంతో పాటు జీర్ణ సమస్యలు ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఇమ్యూనిటీని పెంచుకునేందు చేపలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు. . వీటి నుంచి బయట పడేందుకు చేపలను తింటారు. మృగశిర కార్తె రోజు నీచు పదార్థం తినాలని చెబుతారు. దీంతోనే చేపలు తినడానికి ఇష్టపడతారు. చేపలు అందుబాటులో లేకపోతే చికెన్, కోడిగుడ్లు తినడం చేస్తుంటారు

మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. మృగశిర రోజు చేపలు తినాలని పెద్దలు చెబుతున్నందున అందరు వాటిని తినాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే చేపలు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తారు. చేపల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.

చేపల్లోని పోషకాలు గుండెజబ్బులని దూరం చేస్తాయి. వీటల్లో మనకి అవసరమయ్యే ఎన్నో మాంసకృత్తులు, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా చేపల్లో విటమిన్స్ ఎ, డి, ఇ, కే, ఉంటాయి. వీటితో పాటు థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. చేపల్లోని ఐరన్ కంటెంట్ మెదడు ఎదుగుదలకు సాయం చేస్తుంది. వీటి ద్వారా లభించే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. చిన్న చేపల్ని తిన్నప్పుడు కాల్షియం, ఐరన్ సమృద్ధిగా అందుతాయి. రక్తవృద్ధికి కారణమయ్యే హిమోగ్లోబిన్ కూడా చేపల ద్వారా లభిస్తుంది.


చేపల్లోని కొవ్వు బీపిని కంట్రోల్ చేస్తాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపునకు మేలు చేస్తాయి. వీటిని తినడం ఆస్తమా పేషెంట్స్‌కి కూడా మంచిది. అదే విధంగా కొంతమంది మృగశిర కార్తె రోజున ఇంగువ కూడా తింటారు. సముద్రపు చేపల్లో అయోడిన్ ఉంటుంది. వీటిని వండేటప్పుడు ఉప్పు సరిగ్గా చూడాలి. లేకపోతే ఎక్కువ అవుతుంది. అదే విధంగా తాజా చేపలను తినడం వల్ల విటమిన్ సి అందుతుంది. దీని కారణంగా చర్మం కూడా మెరుస్తుంది.