చేపల ఉత్పత్తి పెంచితే మత్స్యకారులకు ఆదాయం : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

చేపల ఉత్పత్తి పెంచితే మత్స్యకారులకు ఆదాయం : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

బోయినిపల్లి, వెలుగు: చేపల ఉత్పత్తి పెరుగుదలతో మత్స్యకారులకు ఆదాయం పెరుగుతుందని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్ బృందం, కేంద్ర ప్రభుత్వ అధికారులు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు చైర్మన్ కమిటీ.. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మత్స్యకారుల ఆర్ధిక వృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. 

సహకార సంఘాలకు ఆర్థిక సహాయం అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని బృందం సందర్శించింది. ఉత్పత్తి, ఆదాయం, నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్ బృంద సభ్యులు జూలియన్ మిలియన్, అనుజా శుక్లా, ఆర్పీ సిలార్డ్, ఇంతిసార్ ఎ.సిద్దిఖీ, దీపా సుమన్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య పాల్గొన్నారు.