
మనలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. ఐరెన్ లోపం వల్ల బద్ధకంగా, బలహీనంగా మారుతుంటాము. ఐరెన్ లోపం దీర్ఘకాలంలో అనేక ఇతర తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఇది రక్త నియంత్రణ, మోగ్లోబిన్ స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల శరీరంలో తగినంత ఐరెన్ ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో ఐరెన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర, దానిమ్మ, ఆప్రికాట్లు, గుమ్మడికాయ గింజల్లో ఐరెన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఐరెన్ లోపం ఉన్న వారు తమ దైనందిన జీవితంలో వీటిని అధికంగా తింటే ఐరెన్ లోపం నుంచి బయటపడొచ్చు. అయితే ఐరెన్ పోషకాలు కలిగిన కూరగాయలు, పండ్లతో సులభంగా రుచికరమైన ,పోషకమైన స్నాక్స్ ను తయారు చేయవచ్చు.
బచ్చలికూర కబాబ్
బచ్చలికూరలో ఐరెన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకు కూరలను అనేక రకాలుగా ..ఈజీగా వండుకుని స్నాక్స్ లా తినొచ్చు. స్టఫ్డ్ బచ్చలికూర కబాబ్‌లను సిద్ధం చేయడానికి జీలకర్ర, అజ్వైన్‌ను వేడిచేసిన నూనెలో వేయాలి. బచ్చలి కూర, ఇంగువ పొడిని కూడా వీటికి జోడించాలి. కొన్ని నిమిషాలు వేయించిన తర్వాత ఫిల్లింగ్ కోసం వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర, వేయించిన జీలకర్ర పొడి, దానిమ్మ పొడితో వేయాలి. వేరొక గిన్నెలో ఉడికిన బచ్చలికూరను గడ్డ పెరుగుతో కలిపి పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి..లోపల జీడిపప్పు నింపి కబాబ్ ఆకారంలో చుట్టాలి. కబాబ్‌లను షాలో ఫ్రై చేసి తాజా చట్నీ లేదా సాస్‌తో తింటే రుచికి రుచి...ఆరోగ్యానికి ఆరోగ్యం.
సోయా చాప్ రోల్
ఇనుము లోపంత ఉన్న వాళ్లు సోయా చాప్ ను ఆహారంగా తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో క్యాల్షియం, పొటాషియం, సెలీనియం కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. సోయా టేస్ట్ ను ఆస్వాదించడానికి స్టఫ్డ్ రోల్ రూపంలో వంటకం చేసుకుంటే బెటర్. ముందుగా సోయా చాప్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి. వాటిని ఒక గిన్నెలో వేసి పెరుగు,మసాలాలతో మెరినేట్ చేయాలి. ఇది మెరినేట్ అవుతున్నప్పుడు, మైదా పిండిని పరాటాలు లేదా రోటీలు చేసుకోవాలి. మెరినేషన్ తర్వాత సోయా ముక్కలు పూర్తిగా ఉడికినంత వరకు పాన్‌లో వేయించాలి. వాటిని రోటీ లోపల పెట్టి..పైన గ్రీన్ చట్నీ, స్పైసీ రెడ్ చట్నీ, ఉల్లిపాయలు మరియు చాట్ మసాలా వేసి తింటే నా సామిరంగా..మస్తు ఉంటది.
బీట్‌రూట్ ఆలూ కట్‌లెట్
బీట్‌రూట్‌లు శరీరంలోని ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా బీట్ రూట్ లో ఐరెన్ కూడా ఉంటుంది. అయితే బీట్ రూట్ జ్యూస్ ఇష్టపడి వారు..కట్ లెట్ చేసుకుని తినొచ్చు. పెద్ద గిన్నెలో తురిమిన బీట్‌రూట్‌తో పాటు మెత్తని బంగాళాదుంపలను వేసి కలపాలి. ఆ తర్వాత మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా జోడించాలి. అటు పిండిని తీసుకుని దాంతో చిన్న చిన్న బాల్స్‌గా చేసి.. వాటిని టిక్కీల ఆకారంలో ఉండేలా చదును చేయాలి. దోరగా వేయించుకోవాలి. అవి ఉడికినంత వరకు కాల్చి..వాటిపై పుదీనా చట్నీ లేదా టొమాటో కెచప్‌తో తింటే యమ టేస్టీగా ఉంటుంది.
మొక్కజొన్న , దానిమ్మ చాట్
దానిమ్మలో ఆస్కార్బిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి తగినంత ఐరెన్ ను అందిస్తుంది. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. భోజన ప్రియులు కొత్తగా ఏదైనా తినాలి అనుకుంటే మొక్కజొన్న, దానిమ్మ చాట్‌ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న గింజలు, దానిమ్మ, తరిగిన పుదీనా, తరిగిన క్యాప్సికం వేయాలి. వీటికి చింతపండు సారం, ఉప్పు, చాట్ మసాలా, ఆవాలు, తరిగిన కొత్తిమీర , జీలకర్ర, కారం వేసి కలపాలి. అంతే మొక్కజొన్న, దానిమ్మ చాట్ రెడీ..
బాదం, చిలగడదుంప, దానిమ్మ చాట్ రెసిపీ
ప్రత్యేకమైన చాట్ రెసిపీ తినాలని ఆశిస్తున్న వారికి బాదం, చిలగడదుంప, దానిమ్మ చాట్ రిసిపి బెస్ట్ ఆప్షన్. ఈ చాట్ లో ఉండే జీడిపప్పులో అధిక ఐరన్ కంటెంట్ ఉంటుంది. అలాగే బాదంలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ చాట్‌లోని చిలగడదుంప శరీరానికి అవసరమైన ఇతర పోషకాలను అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన చాట్ చేయడానికి తెల్ల బఠానీలను ఉడకబెట్టాలి. వాటి నుండి రగ్దాను తయారు చేయాలి. మరో ప్రత్యేక గిన్నెలో ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా కలపాలి. మరొక ప్రత్యేక గిన్నెలో బాదం, దానిమ్మ గింజలు, బత్తాయి తీసుకోవాలి. వీటికి సౌంత్ చట్నీ, నిమ్మరసం, చాట్ మసాలా, తరిగిన కొత్తిమీర జోడించాలి. ఆ తరువాత సర్వింగ్ ప్లేట్‌లో రగ్దా పొరను వేసి, పైన బాదం చాట్ మిక్స్‌ను వేయాలి. కొద్దిగా కొత్తిమీరతో అలంకరిస్తే..ఎంతో రుచిగా ఉంటుంది.