లద్దాక్‌లో నది ఉప్పొంగి ఐదుగురు జవాన్లు మృతి

లద్దాక్‌లో నది ఉప్పొంగి ఐదుగురు జవాన్లు మృతి

హిమాలయ పర్వతాల మధ్య ఉన్న లద్దాక్ లో శనివారం ఒక్కసారిగా వరదలు సంభవించాయి. లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్‌సైజ్ చేస్తుంది. ష్యోక్ నదిని టీ 72 యుద్ద ట్యాంక్ పై దాటుతుండగా ఆకస్మికంగా నదీ ఉదృతి పెరిగింది. నదీ ప్రవాహంలో యుద్ద ట్యాంక్ అందులోని ఐదుగురు సైనికులు చిక్కుకొని కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు, ఓ JCO ఆఫీసర్  గల్లంతు అయ్యారు. 

వరదలో కొట్టుకుపోయిన వారి కోసం వెంటనే మిగిలిన ఆర్మీ జవాన్లు రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు. దురదృష్టవశాత్తు నదీ ప్రవాహంలో గల్లంతు అయివాన వారి  మృతదేహాలను సైన్యం గుర్తించింది. మొదట ఒకరి మృతదేహం దొరకగా.. తర్వాత మిగిలిన నలుగురి డెడ్ బాడీలు లభించాయి. వారి మృతదేహాలను అధికారులు ఆర్మీ క్యాంప్ ఆఫీసుకు తరలించారు. వీరి మృతి పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. యుద్దట్యాంక్ ను నదీ దాటిస్తుండగా ఐదుగురు సైనికులు వరద కారణంగా కొట్టుకుపోయి చనిపోయారని  ఆయన ఎక్స్ ఖాతాలో విచారం వ్యక్తం చేశారు.