రంజాన్ రోజూ స్కూల్ పెట్టారు.. బస్సు బోల్తా పడి ఐదుగురు పిల్లలు మృతి

రంజాన్ రోజూ స్కూల్ పెట్టారు.. బస్సు బోల్తా పడి ఐదుగురు పిల్లలు మృతి

హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. నార్నాల్‌లో ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం పాఠశాల బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.  స్కూల్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు చేరవేస్తున్న బస్సు రోడ్డుపై ఉన్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బోల్తా పడింది.  

బస్సులో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 35 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.  దేశ వ్యాప్తంగా  రంజాన్ పండుగ సందర్భంగా  సెలవు ఉన్నప్పటికీ పాఠశాల తెరిచి ఉండడం పోలీసులకు  ఆశ్చర్యం కలిగిస్తుంది.  గాయపడిన విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  

అయితే ఆరేళ్ల క్రితమే అంటే 2018లోనే  బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిందని అధికారిక పత్రాలు చూపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.