కరోనా : డాక్టర్ల కోసం ఫైవ్ స్టార్ హోటల్స్‌

కరోనా : డాక్టర్ల కోసం ఫైవ్ స్టార్ హోటల్స్‌

కరోనాను అరికట్టడానికి భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తమకు తోచినైనంత సహాయాన్ని చేస్తున్నారు పలువురు ప్రముఖులు. ఇందులో సామాన్య పజలు కూడా భాగమై పూటగడవని వారికి తమకు తోచినంత భోజనాన్ని అందుబాటులో వున్న వారికి సరఫరా చేస్తున్నారు.  అయితే కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఉండేందుకు వీలుగా పలు ఐదు నక్షత్రాల హోటల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు.

కరోనా (కోవిడ్ -19) వైరస్ సోకిన వారికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ డ్యూటీ ముగిశాక ఇంటికి వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించిన ప్రభుత్వాలు, వారు ఉండేందుకు వీలుగా…. ఐదు నక్షత్రాల హోటల్స్‌ను అందుబాటులోకి తీసుకవచ్చాయి. కరోనా రోగులనుంచి ప్రమాదవశాత్తు డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా వారి నుంచి వ్యాధి బారిన పడే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వాలు తెలిపాయి.

ఇందుకు గాను ఢిల్లీ సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు, వారికి సహకరిస్తున్న వైద్య సిబ్బంది ఉండేందుకు హోటల్ లలిత్ లో 100రూమ్ లను కెటాయించినట్లు తెలిపింది.

ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్… లక్నోలోని  ఐదునక్షత్రాల హోటల్ ను డాక్టర్లకు, వైద్య సిబ్బంది ఉండేందుకు వీలుగా వాటిని ఐసోలేషన్ జోన్‌లుగా మార్చేసింది.

లక్నో లోని హయాత్ రెసిడెన్సి, ఫేయిర్ ఫీల్డ్ బై మారియట్ అనే రెండు హోటల్స్‌ని రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ వైద్య సిబ్బందికి, డాక్టర్లకు కెటాయించినట్లు తెలిపారు లక్నో డిస్టిక్ మెజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాశ్.  ఈ రెండు హోటల్స్ డాక్టర్ ఏకే త్రిపాటి డైరెక్టర్ ఆఫ్ రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో ఉంటాయని తెలిపారు.

లక్నోలోని…  హోటల్ ఫికాడిల్ మరియూ లెమన్ ట్రీ హోటల్స్ కూడా కోవిడ్ – 19 వైరస్ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి అందిస్తున్నట్లు తెలిపింది యూపీ ప్రభుత్వం. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో వైద్యం అందిస్తున్న వారికి ఆ హోటల్స్‌లో నివాసం ఉండొచ్చని చెప్పారు. ఇవి డాక్టర్ ఆర్‌కే ధిమాన్ ఎస్‌జీపీజీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నాయి.

కరోనా వ్యాధి గ్రస్తులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది  పలు చోట్ల కిరాయికి ఉన్నారు. అయితే వారు వుండే ఇంటి ఓనర్లు ఇల్లు కాళీచేయాల్సిందిగా కోరిన విషయంపై ప్రధాని మోడీ స్పంధించారు. డాక్టర్లకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పాటు డాక్టర్లు తెల్లకోటు వేసుకున్న దేవుళ్లవంటి వారని కొనియాడారు.