
ఆమెరికాకు చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు చనిపోయినట్లుగా ఆ దేశ ఆర్మీ అధికారులు ప్రకటించారు. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10న హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత సమస్య తలెత్తడంతో మధ్యధార సముద్రంలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. ఆమరులైన సైనికుల సేవలను కొనియాడారు. అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండటం కోసం సైనికులు ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, మన దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవల్ని కొనియాడారు.
కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధార ప్రాంతంలో అమెరికా ఒక ఆర్మీ బృందాన్ని మోహరించిన సంగతి తెలిసిందే.
Also Read :- ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారత్ ఓటు