ఇండోనేసియా వరద బీభత్సంలో 70 మంది మృతి

ఇండోనేసియా వరద బీభత్సంలో 70 మంది మృతి

ఇండోనేసియాలో భారీ వర్షాలు, వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు సహా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 70కు చేరింది. 40 మందికి పైగా గల్లంతయ్యారు. బాధితులకు సాయం అందించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల ధాటికి తూర్పు తైమూర్ బాగా దెబ్బతింది.  21 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదలతో వేలాది సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి.. జనం నిరాశ్రయులైయ్యారు. రోడ్లు, రహదారులు మట్టిలో కూరుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు. వరద నీటిలో చిక్కుకు పోయి..ఇళ్లలోనే ఉండిపోయిన వారికి మెడిసిన్స్, ఆహారం, దుప్పట్లు అందిస్తున్నారు విపత్తు నిర్వహణ అధికారులు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.