విమాన ప్రయాణానికి మరో రూ.20 ఎక్స్​ట్రా

విమాన ప్రయాణానికి  మరో రూ.20 ఎక్స్​ట్రా

న్యూఢిల్లీ : విమాన ప్రయాణం జూలై ఒకటో తేదీ నుంచి భారం కాబోతుంది. ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేసే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజును రూ.130 నుంచి రూ.150 కు పెంచాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. విదేశీ ప్రయాణికులకు కూడా వచ్చే నెల నుంచి ఈ ఏవియేషన్ సెక్యురిటీ ఫీజును(ఏఎస్‌‌ఎఫ్‌‌) 3.25 డాలర్ల నుంచి 4.85 డాలర్లకు  పెంచనున్నట్టు అధికారిక డాక్యుమెంట్‌‌లో వెల్లడించింది. దేశీయ ప్రయాణికులపై ఏఎస్‌‌ఎఫ్‌‌ కింద రూ.150 ఛార్జీని విధించనున్నామని ఇటీవల విడుదల చేసిన సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది. పీఎస్‌‌ఎఫ్‌‌(ఎస్‌‌సీ) స్థానంలో ఇక ఏఎస్‌‌ఎఫ్‌‌ ఉంటుంది. పీఎస్ఎఫ్‌‌ అంటే ప్యాసెంజర్ సర్వీస్ ఫీజు.