
- డే ఫ్లైట్ సిలబస్ పూర్తి
- తొలి మహిళా పైలట్ గా చరిత్ర
భారత వైమానిక దళానికి చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్ హాక్‌ను నడిపిన తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ చరిత్రకెక్కారు. ఆమె డే కంబాట్ సిలబస్ ను పూర్తి చేసినట్లు ఎయిర్ ఫోర్స్ శుక్రవారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నాలుగు ఫైటర్ జెట్లతో పోరాడిన మోహన, సక్సెస్ ఫుల్‌గా హాక్ ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించింది. ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ మిషన్లలో మోహన తీవ్రంగా తర్ఫీదు తీసుకున్నారు. రాకెట్లు ఫైర్ చేయడం, గన్స్ వాడకం, శక్తిమంతమైన బాంబులను విసరడం, లెవల్ ఫ్లయింగ్ ఎక్సర్ సైజుల్లో ఆమెకు శిక్షణ ఇచ్చింది. దాదాపు 500 గంటల పాటు మోహన ఫైటర్లను నడిపారు. ఇందులో కేవలం హాక్ ఎంకే 132 జెట్ మీద 380 గంటలు శిక్షణ తీసుకున్నారు. గత వారం ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ మిగ్–21 బైసన్ ఫైటర్ డే కంబాట్ సిలబస్‌ను పూర్తి చేసి తొలి మహిళా పైలట్‌గా నిలిచారు.