ఫ్లిప్‌‌కార్ట్ సరికొత్త పేమెంట్ ఆప్షన్

ఫ్లిప్‌‌కార్ట్ సరికొత్త పేమెంట్ ఆప్షన్

ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొంతే చెల్లించవచ్చు
క్యాన్సిలేషన్స్ తగ్గించేందుకు ఈ ఆప్షన్

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ త‌న‌ కస్టమర్ల కోసం సరికొత్త పేమెంట్‌ ఆప్షన్‌‌ను ప్రవేశపెట్టింది. క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ), ఈఎంఐ ఆప్షన్లతో పాటు, కస్టమర్లు ఆర్డ‌ర్ ఏదైనా ప్రొడక్ట్ ను ఆర్డ‌ర్ చేసుకున్న‌ప్పుడే కొంత పేమెంట్ చేసుకుని, మిగిలిన మొత్తాన్ని క్యాష్ ఆన్‌‌డెలివరీ లేదా ఆన్‌‌లైన్ పేమెంట్ చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్ చెప్పింది. ఈ ఆప్షన్ ‌‌ద్వారా క్యాన్సిలేషన్స్‌ను లేదా రిటర్న్‌‌లను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. క్యాన్సిలేషన్న్ తక్కువగా ఉన్నప్పుడు, సెల్లర్లకు జీఎంవీ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని, దీంతో సెల్లర్లకు తాము సాయం చేసినట్టు ఉంటుందని పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీలో జీఎంవీ గ్రోత్ ఎక్కువగా ఉందని, కానీ క్యాన్సిలేషన్స్ ‌కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

ఈ కొత్త పేమెంట్ విధానంలో కూడా అన్ని రకాల ఫీజులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ఈ కొత్త పేమెంట్ మోడ్‌‌లో కూడా ఫిక్స్‌డ్ ఫీజు, కమిషన్, షిప్పింగ్ ఫీజు, క్యాన్సిలే షన్ ఫీజు ఉంటాయని… కస్టమర్ పూర్తి పేమెంట్ జరిపాక, ఫీజులను ఛార్జ్ చేస్తామని చెప్పింది. సెల్లర్లకు చెల్లించాల్సిన కలెక్షన్ ఫీజు 2 శాతాన్ని కస్టమర్లే చెల్లించాలని తెలిపింది. ఈ ఛార్జ్ ఆర్డ‌ర్ ప్లేస్ చేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. అమెరికా, ఈయూ, ఇతర డెవలప్డ్‌ దేశాలు మాదిరి ఈ–కామర్స్ ను ప్రీపెయిడ్ చేయడం ఇదే తొలి అడుగని ఆన్‌‌లైన్ సెల్లర్స్ అసోసియేషన్ ఏఐఓవీఏ చెప్పింది. దీంతో ధరల్లో 2–3 శాతంతగ్గడంతో పాటు, ఆర్డర్లు క్యాన్సిలేషన్ అయ్యే నష్టాలను తగ్గించవచ్చని పేర్కొంది. కొత్త పేమెంట్ విధానంతో పాటు, ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ప్రొడక్ట్‌ కంట్రీ ఆఫ్ ఒరిజిన్‌‌ను ఇవ్వడం ప్రారంభించింది. దీని ద్వారా ఆ ప్రొడక్ట్ ‌ఎక్కడ తయారైందో చెప్పవచ్చు.

మ‌రిన్ని వార్తల కోసం..