రూ.41 వేల కోట్లు తగ్గిన ..ఫ్లిప్​కార్ట్​ వాల్యుయేషన్​

రూ.41 వేల కోట్లు తగ్గిన ..ఫ్లిప్​కార్ట్​ వాల్యుయేషన్​

న్యూఢిల్లీ :  యూఎస్​ -ఆధారిత పేరెంట్​ కంపెనీ వాల్‌‌మార్ట్​కు చెందిన ఈ–కామర్స్​ కంపెనీ ఫ్లిప్​కార్ట్​  వాల్యుయేషన్ జనవరి 2022తో పోలిస్తే జనవరి 2024 నాటికి  5 బిలియన్ల డాలర్లు  (దాదాపు రూ.41వేల కోట్లు ) తగ్గింది. జనవరి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో

వాల్యుయేషన్  40 బిలియన్​ డాలర్ల నుంచి జనవరి 31, 2024 నాటికి  35 బిలియన్​ డాలర్లకు పడిపోయింది.  ఫిన్‌‌టెక్ సంస్థ ఫోన్​పేని ప్రత్యేక కంపెనీగా విడదీయడం ఈ క్షీణతకు కారణమని వాల్‌‌మార్ట్  పేర్కొంది.