శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద
  • ఇన్ ఫ్లో: 1 లక్షా 6 వేల 773 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో: 29 వేల క్యూసెక్కులు

శ్రీశైలం: కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 1 లక్షా 6 వేల 773 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 29 వేల క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ వద్ద నీటిమట్టం 843.1అడుగులతో 66.70 టీఎంసీల నీరు ఉంది.
 శ్రీశైలంకు ఎగువన ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1 లక్షా 11 వేల 72 క్యూసెక్కుల వరద  వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.66టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో వైపు సగటున 1 లక్షా 31 వేల క్యూసెక్కుల నీరు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి 36 వేల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. నారాయణపూర్ నుంచి 42 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.