
- వరద ఉధృతిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి
- ఎమర్జెన్సీ అయితే డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేయండి
- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్, వెలుగు : ప్రాణహిత, గోదావరి నదిలో వరద పోటెత్తుతుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు. ప్రాణహిత నది ఉధృతంగా పారుతున్న నేపథ్యంలో అలుగాం, అర్జునగుట్ట, అన్నారం తదితర గ్రామాలు కొంత మేర వరద ప్రభావానికి గురయ్యాయన్నారు.
జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉండాలని, హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తనకు డైరెక్ట్‌గా ఫోన్ చేయాలని చెప్పారు. ప్రాణహిత వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ కుమార్ దీపక్‌ను ఆదేశించారు. పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రెవెన్యూ, పోలీస్‌తో పాటు వివిధ శాఖల ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు