మేడిగడ్డ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహం

మేడిగడ్డ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని  కాళేశ్వర  మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.  గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 7వేల 320 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాణహిత నుంచి 24 వేల 375 క్యూసెక్కులు ఇన్ ప్లో ఉంది.  29 వేల 718 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది.   

బ్యారేజ్ లో నీటి నిల్వ 13.05 టీఎంసీలకు చేరగా .. మూడు గేట్లు ఎత్తి 9 వేల 816 క్యూసెక్కులు దిగువకు వదిలారు.  మరోవైపు పార్వతీ బ్యారేజ్  కు 14 వేల 665 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది.  సరస్వతీ పంపు హౌజ్ నుంచి 14 వేల 655 క్యూసెక్కుల  నీటిని 5 మోటార్ల ద్వారా పార్వతీ బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తున్నారు.