సాగర్కు కొనసాగుతున్న వరద ఉధృతి

సాగర్కు కొనసాగుతున్న వరద ఉధృతి
  • 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల 

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4,49,071 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో సాగర్​26 క్రస్ట్ గేట్లను10 ఫీట్లు ఎత్తి 3,54,718 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిలువ సామర్థ్యం 590 అడుగుల(312. 0450 టీఎంసీల)కు ప్రస్తుతం రిజర్వాయర్ లో 583.50  అడుగుల( 293.1090 టీఎంసీ ) నీటి నిల్వను మెయింటెన్ చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,155 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9019 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా క్యూసెక్కులు 6401, ఎమ్మార్పీ ద్వారా 2400 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 300 క్యూసెక్కుల చొప్పున మొత్తం ప్రాజెక్టు నుంచి 4,31,678 క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లో గా వదులుతున్నారు.

పులిచింతలకు భారీగా ఇన్​ఫ్లో..

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : చింతలపాలెం  మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఎగువ వరద కొనసాగుతోంది. శుక్రవారం ప్రాజెక్టుకు 3,81,512 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 11  గేట్లను ఎత్తి 3,58,374  క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 42.16 టీఎంసీల నీరు స్టోరేజీ ఉంది.