జర్మనీని వరదలు ముంచెత్తుతున్నయ్

జర్మనీని వరదలు ముంచెత్తుతున్నయ్

బెర్లిన్: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జర్మనీని వరదలు ముంచెత్తుతున్నాయి. వరద బీభత్సానికి 19 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో జనాలు తప్పిపోయారు. పశ్చిమ కౌంటీ యాస్కిర్చెన్ లో ఆరుగురు, అహర్ వీలర్ కౌంటీలో నలుగురు చనిపోయారని అధికారులు గురువారం చెప్పారు. వరదలు పోటెత్తడంతో 50మంది ఇళ్లలో చిక్కుకున్నారని, రెస్క్యూ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొండచరియలు విరిగి పడి చాలా గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయని, వరదల్లో చాలామంది తప్పిపోయారని చెప్పారు. నార్త్-రైన్ వెస్ట్‌‌‌‌‌‌‌‌ఫాలియా రాష్ట్రంలో ప్రభుత్వం ట్రాన్స్ పోర్టు సేవలను నిలిపేసింది. భారీ వానలకు తూర్పు బెల్జియంను వరదలు ముంచెత్తాయి. మీయుస్ నది ఉప్పొంగుతుండటంతో సిటీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరదల ధాటికి వందలాది కార్లు, వెహికిల్స్ కొట్టుకుపోయాయని అధికారులు చెప్పారు. టర్కీలోనూ బుధవారం నుంచి కుండపోత వానలు పడుతున్నాయి. నల్ల సముద్ర తీర ప్రాంతాల్లో వరదల ధాటికి ఆరుగురు చనిపోయారు. చాలా ఇండ్లు కూలిపోయాయని, కొండచరియలు విరిగిపడ్డాయని అక్కడి అధికారులు చెప్పారు.