
నర్సులు ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకలాంటివారు. కరుణతో కూడిన సంరక్షణ ఆరోగ్య అవగాహన ప్రదాతలు. సానుభూతి వృత్తి నైపుణ్యంతో సేవ చేస్తారు నర్సులు వైద్యుడికి రోగికి మధ్య వారధులు. వైద్యుడు రోగనిర్ధారణ చేస్తే చికిత్స అసలు బాధ్యత నర్సుపై ఆధారపడి ఉంటుంది. నర్సింగ్ సిబ్బంది లేకపోతే వైద్య సౌకర్యాలు అందవు నర్సుల నిబద్ధత, ధైర్యం గుర్తించి జరుపుకునే వేడుకలు ప్రపంచ నర్సింగ్ దినోత్సవం.
నర్సులు మానవాళికి ఆరోగ్యాన్ని అందిస్తారు. సేవకు మాతృత్వానికి ప్రతీక నర్సులు. నర్సులు తెల్లని దుస్తులు తలపై టోపీ థరించి చెరగని చిరునవ్వు ఆప్యాయమైన పలకరింఫు నిస్వార్థంతో సేవ చేసి రోగాన్ని తగ్గిస్తారు కకావికలమైన జీవితాలకు ప్రేమ పూర్వక సేవలు అందించే ప్రేమమూర్తులు మనిషి జననం నుంచి మరణం వరకు ఏదో ఒక దశలో సేవ అందిస్తారు.
నర్సులు మాతృత్వానికి ప్రతీక ఆప్యాయతకు ఆనవాళ్లు ఆక్సిడెంట్లలో శరీర దెబ్బలకు తల్లడిల్లె వారికి అవస్థలతో బాధపడే రోగులకు గొప్ప ఊరడింపు కలిగిస్తారు నర్సులు మాటలతో నవ్వుతూ నవ్విస్తూ మదిని పులకరింపచేసే చిరునవ్వుల సారథులు అప్రమత్తంగా ఉంటూ రోగికి ఆరోగ్యాన్ని అందిస్తారుమానవ సేవేమాథవ సేవగా అభయహస్తాన్ని అందించే ఆరోగ్య కార్యకర్తలు నర్సులు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు.
నేదునూరి కనకయ్య