గాల్లో వెళ్లే కారు .. గంటకు స్పీడ్ 180 కి.మీ

గాల్లో వెళ్లే కారు .. గంటకు స్పీడ్ 180 కి.మీ

ట్రాఫిక్​ లొల్లి లేకుండా గాల్లో హాయిగా కార్లో షికారు కెళితే పానం ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇటు రోడ్డు మీద, అవసరమైనప్పుడు గాల్లోన దూసుకుపోతే ఆ కిక్కే వేరు. రోడ్డు మీదైతే గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్​.. గాల్లోకి లేస్తే 180 కిలోమీటర్ల వేగం.. ఒక్కసారి ట్యాంక్​ ఫుల్​ చేయిస్తే 500 కిలోమీటర్ల జర్నీ.. ఇంతకన్నా ఏం కావాలి ఓ ఫ్లయింగ్​ కారుకు. అలాంటి కారు మన దేశంలో తయారైతే..! నెదర్లాండ్స్​కు చెందిన పాల్​–వీ (పర్సనల్​ ఎయిర్​ ల్యాండ్​ వెహికిల్​) అనే సంస్థ ఇండియాలోనే ఈ ఫ్లయింగ్​ కారును తయారు చేయబోతోంది. గుజరాత్​లో ప్లాంట్​ను పెట్టబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది పాల్​–వీ. ప్లాంట్​ పెట్టేందుకు అన్ని అనుమతులు ఇచ్చేందుకు గుజరాత్​ సర్కార్​ ఒప్పుకుందని కంపెనీ ఇంటర్నేషనల్​ బిజినెస్​ డెవలప్​మెంట్ డివిజన్​ వైస్​ ప్రెసిడెంట్​ కార్లో మాస్​బోమెల్​ చెప్పారు. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​, ప్రపంచస్థాయి మౌలిక వసతులుండడం వల్లే గుజరాత్​లో ప్లాంట్​ పెడుతున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు, ఇక్కడి నుంచే విదేశాలకూ మేడిన్​ ఇండియా ఫ్లయింగ్​ కార్లను ఎగుమతి చేయనుంది కంపెనీ. ఇప్పటికే 110 ఆర్డర్లు విదేశాల నుంచి వచ్చాయట. 2021 నుంచి ప్లాంట్​లో ఈ ఫ్లయింగ్​ కార్లను తయారు చేసి, అదే ఏడాది నుంచి అమ్మకాలు మొదలుపెట్టనుంది కంపెనీ.