లారీ నిండా వైసీపీ జెండాలు, టోపీలు

లారీ నిండా వైసీపీ జెండాలు, టోపీలు

రేణిగుంట విమానాశ్రయం ఓల్డ్ రోడ్డు మార్గం ఉన్న ఓ ప్రైవేటు గోడౌన్ దగ్గర వైయస్సార్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న లారీని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ రాకను గమనించి గోడౌన్ సిబ్బంది తాళాలు వేసి పరారయ్యారు. గౌడన్ లో కూడా వైయస్సార్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి తోపాటు ఇతరతర వస్తువులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. గోడౌన్ తెరిపించడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంఘటన స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు..   గోడౌన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోడౌన్ తెరిచే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. పేపర్లలో కథనాలు వస్తున్నా కూడా.. వైయస్సార్ పార్టీ నాయకులు బరితెగిస్తున్నారని.. పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం టీడీపీకి సంబంధించిన పది పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని.. ఇంత భారీగా తరలిస్తున్న వైయస్సార్ పార్టీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు.