
న్యూఢిల్లీ : ఎఫ్‌ఎంసీజీ కంపెనీ డాబర్ తమ కొత్త మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను సౌత్ ఇండియాలో ఏర్పాటు చేయాలని చూస్తోంది. బిజినెస్ విస్తరిస్తున్న ఈ కంపెనీ కేవలం ఏడాది టైమ్‌లోనే ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ప్రస్తుతం డాబర్ మొత్తం సేల్స్‌లో 20 శాతం సౌత్ ఇండియాలో జరుగుతున్నాయి. ఇంకో 5–6 ఏళ్లలో ఈ నెంబర్ 40 శాతానికి పెరుగుతుందని డాబర్ సీఈఓ మోహిత్ మల్హోత్రా పేర్కొన్నారు. సౌత్ ఇండియా మార్కెట్‌కు తగ్గట్టు కొత్త ప్రొడక్ట్‌లు లాంచ్ చేస్తామని అన్నారు.
డాబర్‌కు ఇండియాలో మొత్తం 13 మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లు ఉన్నాయి. కంపెనీ వివిధ సెగ్మెంట్లలో ఎంటర్ అవుతోంది. డాబర్ ఏడాదికి రూ.350 కోట్ల నుంచి రూ.450 కోట్లు క్యాపెక్స్ కోసం ఖర్చు చేస్తోందని మోహిత్ అన్నారు. సౌత్ ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ పెట్టడంతో పాటు మిడిల్ ఈస్ట్, యూరప్‌లో విస్తరించేందుకు ప్లాన్స్ వేస్తున్నామని చెప్పారు. ‘సౌత్ ఇండియాలో విస్తరిస్తున్నాం.
ప్రస్తుతం మా డొమెస్టిక్ సేల్స్‌లో 19–20 శాతం ఇక్కడే జరుగుతున్నాయి. ఏడెనిమిదేళ్ల క్రితం ఇది 7 శాతం కూడా లేదు. సౌత్ ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ డబుల్ అయ్యింది’ అని మోహిత్ వెల్లడించారు.