అవేర్​నెస్​: నిర్ణయాల్లో అలసట రాకుండా..

అవేర్​నెస్​: నిర్ణయాల్లో అలసట రాకుండా..

ఉదయం పనులన్నీ పూర్తిచేసుకుని ఆఫీసుకి ఏ డ్రెస్​ వేసుకోవాలా అని తర్జనభర్జన పడుతున్నారా? అయితే అది డెసిషన్​ ఫాటిగ్ వల్లే కావచ్చు​. డెసిషన్​ ఫాటిగ్​ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కలిగే అలసట అన్నమాట. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీన్నుంచి బయటపడడం ఎలా? ఈ విషయాల గురించి పరిశోధకులు చెప్పిన వివరాలివి...డెసిషన్​ ఫాటిగ్​ బారిన పడడానికి ముఖ్య కారణం... బుర్ర మీద విపరీతమైన ఒత్తిడి ఉండటమే. 

అదేపనిగా ఒకటిరెండు కాదు... వరసపెట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే... ఆ తరువాత చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేందుకు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. దాంతో మూడ్ పాడైపోతుంది. విపరీతమైన ఒత్తిడి పడుతుంది. శారీరకంగా అలసిపోతారు” అంటున్నారు రీసెర్చర్లు. పైకి పెద్ద సమస్యలా కనిపించనప్పటికీ కంట్లో నలుసులా ఇబ్బంది పెట్టే విషయం ఇది. మరి దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ‘‘మీ ఇంటిని డీక్లట్టరింగ్​ చేస్తే చాలు. ఇంట్లో పనికొచ్చే వాటిని ఉంచి, మిగతా వాటిని మరో ఆలోచన లేకుండా ఇంటినుంచి బయటకు పంపేయాలి” అని చెప్తున్నారు రీసెర్చర్లు. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, బుర్ర బాగుచేసుకోవడానికి మధ్య సంబంధం ఏంటి అంటున్నారా? చాలానే ఉంది. ఇల్లు సర్దుకోవడం మొదలుపెట్టాక బుర్ర సర్దుకోవడం ఖాయం అంటున్నారు సైకాలజిస్టులు.

ఇంటితో మొదలు...

నిజానికి డెసిషన్​ ఫాటిగ్​ నుంచి బయటపడేందుకు రెస్ట్​ తీసుకోవడం, సెల్ఫ్​కేర్​ మీద దృష్టి పెట్టడం వంటివి బాగా పనిచేస్తాయి. అలాగని వీటివల్ల మళ్లీ డెసిషన్​ ఫాటిగ్​ రాకుండా ఉంటుందా? అంటే ‘నో గ్యారెంటీ’. అందుకే నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది మళ్లీ​ ఇబ్బందిపెట్టకుండా ఉండాలంటే... ఇంట్లో వాడని, పనికిరాని వస్తువులను తీసేయడం బెటర్​ ఆప్షన్. ఇంట్లో ఉన్న ఒక్కో గదిని శుభ్రం చేస్తుంటే... బుర్రలో ఉన్న గజిబిజి పరిస్థితి క్లియర్​ అవుతుంటుంది. ఇంటిని ఆర్గనైజ్​ చేసుకోవడం వల్ల ఇంత ఫలితం ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. కానీ దానివల్ల డెసిషన్​ మేకింగ్​ అనేది ఈజీ అవుతుంది. ఆలోచనలు అటుఇటు గెంతకుండా స్థిరంగా ఉంటాయి. మానసికంగా ఎటువంటి శ్రమ లేకుండా ఎక్కువ పనులు చేయొచ్చు​” అంటున్నారు సైకాలజిస్ట్​ అలెక్సా ఆండర్సన్​. 

మినిమలిజంతో...

 డెసిషన్​ ఫాటిగ్​ బారిన పడకుండా ఉండేందుకు బెస్ట్​ సొల్యూషన్​ డీక్లట్టర్. ఇది చాలా సింపుల్​గా అనిపిస్తుంది. కానీ మెదడు మీద చూపే ప్రభావం ఎక్కువ. ఉదాహరణకి మినిమలిస్ట్​ కాన్సెప్ట్​. ఇది అర్థం కావాలంటే యాపిల్​ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్​ జాబ్స్​ని చూడాలి. ఈయన రోజూ బ్లాక్​ టర్టిల్​నెక్​, బ్లూ జీన్స్​ వేసుకుంటాడు. దీనివల్ల రోజూ ‘ఏ డ్రెస్​ వేసుకోవాలి?’ అని ఆలోచించాల్సిన టైం వేస్ట్​ కాకుండా ఉంటుంది. ఆ టైంను ఇన్నొవేషన్స్​ కోసం వాడుకోవచ్చు అంటాడు స్టీవ్స్​. వినడానికి అతిలా అనిపించొచ్చు. కానీ ఈ టెక్నిక్​ చాలా ఎఫెక్టివ్​గా పనిచేసింది అనేందుకు ఎగ్జాంపుల్​ మన కళ్ల ముందు ఉంది. అలాగే మొబైల్​ఫోన్​ను డీ క్లట్టర్​ చేసినా మెంటల్​ ఎనర్జీ ఫ్రీ అవుతుంది” అంటున్నారు కన్సల్టెంట్​ సైకాలజిస్ట్​లు.

 

డెసిషన్​ ఫాటిగ్​ ఎందుకొస్తుంది? అంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఉద్యోగం లేదా ప్రతిరోజు కష్టమైన లేదా ఒత్తిడితో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం. ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఒంట్లో ఒత్తిడితో పాటు ఇంట్లో చెత్త కూడా పెరిగిపోతుంది. దాంతో ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో చూడాలంటే వెతికి వెతికి విసుగొస్తుంది. అందుకే వర్క్​లోడ్​ తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం.

అలసిపోకుండా..

ఇల్లు డీక్లట్టర్​ చేయడం, మినిమలిస్ట్​ అప్రోచ్​ అనేవి డెసిషన్​ ఫాటిగ్ బారిన పడకుండా చేస్తాయి. కానీ ఈ ప్రాసెస్​లో విపరీతంగా అలసిపోతారు. ఎందుకంటే ఏం ఉంచాలి? ఏం తీసేయాలి? ఏం డొనేట్​ చేయాలి? అని కేటగిరీ చేసేందుకు బుర్ర మీద శ్రమ పడుతుంది. ప్రత్యేకించి సెంటిమెంట్స్​తో ముడిపడిన ఐటమ్స్​ తీసేటప్పుడు ఆ శ్రమ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకని డీక్లట్టర్​ చేసే పనిలో శ్రమలేకుండా కొన్ని టిప్స్​ ఫాలో కావాలి. అవేంటంటే...


 ఒక టైమర్​ పెట్టుకుని ఆ టైంలోపు ఎన్ని డెసిషన్స్​ తీసుకుంటున్నారు అనేది గమనించాలి. 20 నిమిషాలకు టైమర్​ సెట్ చేసుకుని, వద్దు అనుకున్న వస్తువులని ఉంచాలా? తీసేయాలా? అనేది నిర్ణయించుకుని వాటిని పక్కన పెట్టేయాలి. టైమర్​ స్టాప్​ అయ్యాక డీ క్లట్టరింగ్​ పనిని ఆపాలి. 20 నిమిషాల తరువాత కూడా ఒంట్లో ఇంకా శక్తి ఉంది. మిగతా వాటి పనికూడా పడదాం అనుకోవద్దు. నిర్ణయాలు తీసుకోవడంలో అలసిపోకుండా ఉండాలంటే ఎనర్జీ పూర్తిగా అయిపోయేంత వరకు పనిచేయకూడదు. చేస్తున్న పనినుంచి బ్రేక్​ తీసుకుని మళ్లీ కాసేపటి తరువాత లేదా మరుసటి రోజు 

ఆ టాస్క్​ పూర్తిచేయాలి

బట్టలు, పుస్తకాలు, వంటసామాను ... ఇలా వస్తువులను కేటగిరీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల  ఏ వస్తువులు ఉన్నాయి? వాటిలో ఎన్ని వాడుతున్నారు? ఎన్ని వాడటం లేదు అనే విషయంలో స్పష్టత వస్తుంది. అప్పుడు ఏ కేటగిరీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుస్తుంది. దేన్ని ఉంచాలి? దేన్ని తీసేయాలి? అనే విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన శ్రమ ఉండదు.
వార్డ్​రోబ్​ క్లీన్​ చేసేటప్పుడు బట్టల్లో ఏవి ఉంచాలి? ఏవి తీసేయాలి? అనే గజిబిజి ఉంటే కనుక వార్డ్​రోబ్​లో హ్యాంగ్​ చేసిన బట్టలను ఆపోజిట్​ డైరెక్షన్​లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏ బట్టలు వాడుతున్నారు. ఏవి వాడట్లేదు అనే విషయం మీద ఒక ఐడియా వస్తుంది. 

 

ఆరు నెలలకు మించి వేసుకోకుండా ఉన్న వాటికి వార్డ్​రోబ్​లో స్థానం లేదు. అందుకని వాటిని వెంటనే తీసేయాల్సిందే. ఆరు నెలలు వాడలేదంటే అవి మీరు ఎప్పటికీ వేసుకోరు. ఇదే సూత్రాన్ని ఇంట్లో మిగతా ఏరియాలకు కూడా పనిచేస్తుంది. ఆరు నెలలుగా  వంటగదిలో వేటినైతే వాడలేదో వాటిని తీసేయాలి. ఫలానా వస్తువును తీసేయకుండా ఇంట్లో ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడాన్ని స్పార్క్​ జాయ్​ మెథడ్​ అంటారు. ఇలాచేసినప్పుడు మీ మనసుకు ఏమనిపిస్తుందో జాగ్రత్తగా గమనించాలి. మనసులో గిల్ట్​  లేదా చిరాకు​ ఉంటే ఆ వస్తువును తీసేయాల్సిందే. ఒకవేళ ఆ వస్తువు మీ మనసుకు ఆనందాన్నిస్తే ఉంచండి.ఇల్లు శుభ్రం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఒత్తిడి, అలసట ఉంటాయి. అందుకని ఆ పనిలో అలసిపోకుండా ఉండాలంటే సరిగా ప్లాన్​ చేసుకోవాలి. బయటపడేయాల్సిన వస్తువుల కోసం బాక్స్​లు​ రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పని కాస్త సులువు అవుతుంది.