తిరుమలలో పొగ మంచు.. భక్తుల పరవశం

తిరుమలలో పొగ మంచు.. భక్తుల పరవశం

తిరుమల చుట్టూ ఉన్న కొండలోయలు హిమాలయాలను తలపిస్తున్నాయి. చలికాలం వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఓ వైపు చల్లటి గాలులు.. మరోవైపు తెల్లటి పొగమంచుతో కూడుకున్న తిరుమల వాతావరణం భక్తుల మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. తిరుమల మొదటి, రెండో ఘాట్ రోడ్ లలో భారీగా మంచు కురుస్తోంది. గత రాత్రి నుంచి ఇక్కడ వర్షం కూడా కురుస్తోంది. తిరుమల శేషాచల కొండలు పొగ మంచుమయం అయ్యాయి. 

చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో తిరుమలలో అద్దె గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం సరిగ్గా కనిపించని పరిస్ధితి నెలకొంది. ప్రధానంగా ఘాట్ రోడ్డులో వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.