ఆఫీస్‌‌కి సేఫ్‌‌గా వెళ్లి రావడానికి టిప్స్‌‌..

ఆఫీస్‌‌కి సేఫ్‌‌గా వెళ్లి రావడానికి టిప్స్‌‌..

కొన్ని సడలింపులు, నిబంధనలతో లాక్‌‌డౌన్‌‌ 3.O కి చేరుకున్నాం! అసలు కథ ఇప్పుడే మొదలైంది. కాబట్టి, ఇప్పటి వరకు ఉన్నదాని కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.  రిస్క్‌‌ తగ్గే వరకు ఇంట్లో ఉండటమే బెటర్‌‌‌‌! వర్క్‌‌ఫ్రమ్ హోమ్‌‌ చేయడం ఇంకా బెటర్‌‌‌‌!! కానీ, కొంతమంది ఆఫీస్‌‌కి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఆఫీస్‌‌కి సేఫ్‌‌గా వెళ్లి రావడానికి కొన్ని రెడీ టిప్స్‌‌..

ది ఇంపార్టెంట్‌‌‌‌ మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కోవిడ్‌‌‌‌–19ని క్యారీ చేస్తున్నారని, వాళ్ల నుంచి మనకు వైరస్‌‌‌‌ సోకుతుందనుకోవాలి. అలాగే, తామూ వైరస్‌‌‌‌ని క్యారీ చేస్తున్నామని, తమ చుట్టూ ఉండేవాళ్లకు దాన్ని వ్యాపింపజేయగలమని అనుకోవాలి. ఇలా మెదడును ట్రైన్ చేయడం వల్ల మనం ఇన్ఫెక్ట్‌‌‌‌ కాము.. అలాగే మన వల్ల వేరొకరూ ఇన్‌‌‌‌ఫెక్ట్‌‌‌‌ కారు. ‘ఆరోగ్య సేతు’ యాప్ డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆరోగ్య సేతు స్టేటస్‌‌‌‌లో ‘సేఫ్​’ అని చూపించకపోతే వెంటనే బాస్‌‌‌‌కి రిపోర్ట్ చేయాలి.

బయటకు అడుగు పెట్టగానే..

  •    చేతులు శానిటైజ్ చేసుకోవాలి. జేబులో శానిటైజర్‌‌‌‌‌‌‌‌ క్యారీ చేయాలి.
  •    మాస్క్‌‌‌‌ పెట్టుకోవాలి. ఆఫీస్‌‌‌‌ ఐడీ కార్డ్ వేసుకోవాలి.
  •    సాధ్యమైనంత వరకు ప్రయాణానికి సొంత వెహికల్‌‌‌‌నే ఉపయోగించాలి.
  •    కారు లేదా బైక్‌‌‌‌పై చేతులు పెట్టే ప్లేస్‌‌‌‌ని శానిటైజ్ చేయాలి.
  •    బాడీ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌ చేసుకోవాలి. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే.. డాక్టర్‌‌‌‌‌‌‌‌ని కలిసి రావాలి.  ఇంట్లోనే ఉండాలి.
  •    ఒకవేళ కంపెనీ కారే.. ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటుంటే.. కారు హైజీన్‌‌‌‌గా ఉందో లేదో చెక్‌‌‌‌ చేసుకోవాలి.

ఆఫీస్‌‌‌‌కి రీచ్‌‌‌‌ కాగానే.. 

  •    ఆఫీస్‌‌‌‌లో అడుగు పెట్టగానే నాలుగు గోల్డెన్ రూల్స్‌‌‌‌ని గుర్తు తెచ్చుకొని.. అన్నీ ఓకేనా? అని చెక్ చేసుకోవాలి.
  •    మెట్లు ఎక్కి.. ఆఫీస్ రూమ్‌‌‌‌కి వెళ్లడానికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి.
  •    ఒకవేళ, లిఫ్ట్‌‌‌‌లో వెళితే ఫిజికల్ డిస్టెన్స్‌‌‌‌ పాటించాలి.
  •    మోచేతులు, భుజాలతో డోర్స్ ఓపెన్ చేయాలి.
  •    ఆఫీస్‌‌‌‌లో కూర్చునే ప్లేస్‌‌‌‌, డెస్క్‌‌‌‌టాప్‌‌‌‌, పరిసరాలు శానిటైజ్ చేశారో లేదో చెక్‌‌‌‌ చేసుకోవాలి.
  •    లిఫ్ట్ బటన్స్‌‌‌‌, కీ బోర్డ్‌‌‌‌, డోర్ హ్యాండిల్స్ ఇలా దేన్ని ముట్టుకున్నా వెంటనే చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి.

ఇంటికి వచ్చేటప్పుడు

  •    మాస్క్‌‌‌‌ పెట్టుకుని జర్నీ చేయాలి.
  •    తలుపులు తెరిచే ఉంచమని.. ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌కి చెప్పాలి.
  •    షూ, చెప్పులు బయటే విడవాలి. బ్యాగ్‌‌‌‌ కూడా బయటే పెట్టాలి.
  •    చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  •    బ్యాగ్‌‌‌‌, షూస్‌‌‌‌ డిస్‌‌‌‌ఇన్‌‌‌‌ఫెక్ట్ లేదా శానిటైజ్ చేయాలి.
  •    మాస్క్ పెట్టుకొనే అప్పటిదాక వేసుకున్న బట్టలు ఉతుక్కోవాలి. మాస్క్‌‌‌‌ని డస్ట్‌‌‌‌బిన్‌‌‌‌లో పారేయాలి. రీ యూజబుల్‌‌‌‌ అయితే వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.

ఇవి కూడా ..

  •    గుంపులు ఉన్న చోటుకి వెళ్లకూడదు. షేక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ ఇవ్వొద్దు. నమస్తే చెప్పడం బెస్ట్‌‌‌‌!
  •    ఫుడ్‌‌‌‌, వాటర్, ఆఫీస్ స్టేషనరీ ఇలా దేన్నీ ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు.
  •    నాలుక మీద తడిని చేతికి అంటించుకొని పేజీలు తిప్పడం, కరెన్సీ లెక్కబెట్టడం లాంటివి చేయొద్దు.
  •    బయట ఎక్కడా ఉమ్మివేయకూడదు.
  •    తుమ్ము, దగ్గు వస్తే చేతుల్ని కాకుండా.. మోచేతినో, టిష్యూ పేపరో, కర్చీఫ్‌‌‌‌నో అడ్డు పెట్టుకోవాలి.

బ్యాగ్స్, షూస్ శానిటైజ్ చేయడం ఎలా?

  •    మాస్క్ పెట్టుకోవాలి.
  •    డిస్‌‌‌‌ఇన్ఫెక్టెంట్‌‌‌‌ లేదా యాంటీ సెప్టిక్ లిక్విడ్‌‌‌‌ని 1:15 నిష్పత్తిలో నీళ్లలో కలపాలి. తర్వాత దాంట్లో క్లాత్‌‌‌‌ని ముంచి బ్యాగ్‌‌‌‌ని, షూస్‌‌‌‌ని తుడుస్తూ.. శానిటైజ్ చేయాలి.
  •    సర్జికల్ స్పిరిట్‌‌‌‌, ఆఫ్టర్‌‌‌‌‌‌‌‌ షేవ్ లోషన్స్‌‌‌‌, 65శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్‌‌‌‌ ఉన్న  డి–యోడరెంట్స్‌‌‌‌ని కూడా వాడొచ్చు.
  •    బ్యాగ్, షూస్ శానిటైజ్ చేశాక.. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.

పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఉపయోగిస్తుంటే

  •    వెహికల్‌‌‌‌లో కూర్చున్న  ప్రతి ఒక్కరూ మాస్క్‌‌‌‌ పెట్టుకున్నారో లేదో చెక్ చేసుకోవాలి.
  •    సీట్‌‌‌‌లో కూర్చున్న తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
  •    సీటులో ఒక్కరు లేదా వరుసలో ఒక్కరు మాత్రమే కూర్చోవాలి.
  •    గాలి కోసం ఏసీ వాడకుండా.. విండోస్‌‌‌‌ ఓపెన్ చేయాలి.
  •    ఫ్యాక్టరీస్‌‌‌‌, మార్కెట్‌‌‌‌ ప్లేసెస్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌, కొనే చోట, అమ్మే చోట ఇలా ప్రతి ఒక్కరూ ‘ మీరు! మీకోసం.. మన అందరి కోసం!!’ ఈ రూల్స్ పాటిస్తే.. లాక్‌‌‌‌డౌన్ 3.O సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కంప్లీట్ చేయగలుగుతాం!

నాలుగు గోల్డెన్ రూల్స్‌‌‌‌

  1. కచ్చితంగా ఎప్పుడూ మాస్క్ పెట్టుకోవాలి.
  2. ఎదుటి మనిషికి కచ్చితంగా ఆరు అడుగుల ఫిజికల్ డిస్టెన్స్‌‌‌‌ పాటించాలి.
  3. ఏ వస్తువును తాకినా సరే.. వెంటనే చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి.
  4. తరచూ కనీసం ఇరవై సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

ఆఫీస్‌‌‌‌లో

  •    సాధ్యమైనంత వరకు ఈ– మీటింగ్స్‌‌‌‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి.
  •    ఒకవేళ కాన్ఫరెన్స్​ హాల్‌‌‌‌లో మీటింగ్ పెడితే.. తక్కువ మందితో దూరంగా కూర్చోవాలి.
  •    ఫొటో కాపీయర్‌‌‌‌‌‌‌‌, రిఫ్రిజిరేటర్, ఏసీ రిమోట్ ఇలా దేన్ని ముట్టుకున్నా వెంటనే చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి.
  •    ఇంటినుంచే లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి.బాధ్యతగా ఎవరి ప్లేస్‌‌‌‌లో వాళ్లు కూర్చొని తినాలి.
  •    అత్యవసరం అయితే తప్ప.. వేరే ఫ్లోర్‌‌‌‌‌‌‌‌కి వెళ్లొద్దు.
  •    ఒక్కసారి ఆఫీస్‌‌‌‌ లోపల అడుగు పెట్టాక..
  •    ఆఫీస్‌‌‌‌ బయటకు వెళ్లి తిరిగిరావొద్దు.

షాప్‌‌‌‌కి వెళితే..

  1. నాలుగు గోల్డెన్ రూల్స్ పాటిస్తూ షాపింగ్ చేయాలి.
  2. ఇంట్లోకి వెళ్లకముందే బ్యాగ్‌‌‌‌లో నుంచి వస్తువుల్ని బయటకు తీసి శానిటైజ్ చేయాలి.
  3. వైట్‌‌‌‌ వెనిగర్‌‌‌‌‌‌‌‌ కలిపిన నీళ్లలో కూరగాయలు, పండ్లు వేసి కడగాలి.
  4. చివరికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

హైపర్ పిగ్మెంటేషన్‌ కి చెక్‌ పెట్టండిలా..