Summer Tour : వేసవి కాలంలో ఈ టైమింగ్స్ లో జర్నీ చేయండి.. లేకపోతే వడదెబ్బ తగులుతుంది..!

Summer Tour : వేసవి కాలంలో ఈ టైమింగ్స్ లో జర్నీ చేయండి.. లేకపోతే వడదెబ్బ తగులుతుంది..!

ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకు సెలవులు ఇస్తారు. దాంతో ఏదైనా కొత్తప్రదేశానికి వెళ్లడానికి కుటుంబంలోని వాళ్లందరూ ప్లాన్ చేసుకుంటారు. మామూలు రోజుల్లో అయితే పర్లేదు కానీ, వేసవికాలంలో విహారయాత్రకు వెళ్లాలంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఎండలు మండిపోతుంటాయి. మరోవైపు కొత్త ప్రదేశాలు. వేసవికాలంలో పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. 

అందుకే రైల్లో అయినా, బస్సులో అయినా ప్రయాణాన్ని ఉదయం పది గంటల లోపు, సాయంత్రం ఐదు తర్వాత మాత్రమే చేయాలి. కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. వాటర్ బాటిల్ ఎప్పుడూ దగ్గరేఉంచుకోవాలి. చెరుకురసం, కొబ్బరి బోండాలు తాగడం వల్ల శరీరాన్ని వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.

ప్రయాణాల్లో లేతరంగుల వస్త్రాలు, శరీరానికి అతుక్కుని ఉండేవి కాకుండా ధరించాలి. అవసరమైతే సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, వెళ్లిన ప్రదేశంలో కొత్తరకం ఫుడ్ దొరికితే ట్రై చెయ్యకూడదు. ఎందుకంటే... ఒక్కోసారి అవి గిట్టక అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల ఆరోగ్యం గురించి విధిగా పట్టించుకోవాలి.

Also Read: మండే ఎండల్లో బెస్ట్ ఫ్రూట్ సలాడ్స్ ఇవే.. మంచి ఆరోగ్యం కూడా..!