
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల శివసాయి టిఫిన్ సెంటర్ ను ఫుడ్ ఇన్ స్పెక్టర్ అనూష సీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం హోటల్లో టిఫిన్ చేసిన కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఫుడ్ పాయిజన్‌తోనే అస్వస్థతకు గురైనట్లు తేలడంతో బాధితులు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేశారు.
హోటల్ తనిఖీ చేయడంతో కుళ్లిన ఆహార పదార్థాలు లభించడంతో హోటల్ ను సీజ్ చేశారు. హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పేర్కొన్నారు.