గోడౌన్‌లోని పంటపై లోన్‌

గోడౌన్‌లోని పంటపై లోన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్నగోడౌన్‌లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే, వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కలిపిస్తోంది. ఇందుకు సంబంధించి  ఫుడ్ అండ్ కన్జూమర్‌‌ అఫైర్స్మినిస్టర్ పియూష్‌ గోయల్‌ సోమవారం ‘ఈ–కిసాన్‌ ఉపజ్‌ నిధి’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఇనీషియేటివ్‌తో రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు.  వేర్ హౌస్‌ ఓనర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను స్టాక్‌ విలువలో ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 3 శాతంగా ఉంది. 

వంట నూనెల దిగుమతులు తగ్గించేందుకు కొత్త మిషన్

వంట నూనెల దిగుమతులను తగ్గించుకోవడానికి, నూనె గింజల ప్రొడక్షన్ పెంచేందుకు ఓ మిషన్ లాంచ్ చేశామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం  పేర్కొన్నారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు.   దీంతో పాటు  అస్సాంలో ఏర్పాటు చేసిన  ఇండియన్ అగ్రికల్చరల్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌‌ఏ) ను ఆయన ప్రారంభించారు. ఇండియా ఏడాదికి 1.6 కోట్ల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటోంది.