బాసర ట్రిపుల్ ఐటీలో 80మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీలో 80మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 80మంది విద్యార్థులు భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇందులో ఐదుగురు విద్యార్థులకు  ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 75మంది విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్ కు పంపించారు. క్యాంపస్ లోని శక్తి క్యాంటిన్ లో తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు చెబుతున్నారు. గతంలోనే శక్తి కిచెన్ భోజనంలో కప్ప వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు.

క్యాంపస్ లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడంతో వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురికి మాత్రం ట్రిపుల్ ఐటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. శక్తి క్యాంటీన్ తో పాటు SS క్యాటరర్స్ ను కేంద్రీయ భండార్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుండడం గమనార్హం.