
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో 2023-–24 సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ కోరుతోంది.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్: ఇందులో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, లెదర్, లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్ విభాగాలు ఉన్నాయి. ఇంటర్/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
బీబీఏ: రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ కోర్సు మూడేళ్లు ఉంటుంది. 10+2/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకునే అభ్యర్థులకు 25 ఏళ్లు మించకూడదు.
పీజీ మాస్టర్ ఆఫ్ డిజైన్: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ విభాగంలో అడ్మిషన్స్‌కు ఫుట్‌వేర్ / లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ / డిజైన్ / ఇంజినీరింగ్ / ప్రొడక్షన్/ టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
ఎంబీఏ: ఈ కోర్సులో చేరేందుకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2023 పరీక్షలో మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవాలి. జూన్ 18న పరీక్ష నిర్వహించనున్నారు. వివరాలకు www.fddiindia.com వెబ్సైట్ సంప్రదించాలి.