వేడుక ఏదైనా మెహందీ ఉండాల్సిందే

వేడుక ఏదైనా మెహందీ ఉండాల్సిందే
  • వేడుక ఏదైనా మెహందీ ఉండాల్సిందే
  • సిటీలో రెండు వేల మందికి పైగానే మేల్ ఆర్టిస్టులు
  • మాల్స్‌‌‌‌లో స్టాల్స్, ఇండ్ల దగ్గర బిజినెస్ 
  •  స్టూడియోల్లోనూ పనిచేస్తూ సంపాదన

వేడుక ఏదైనా ఆడవారికి చేతులు, కాళ్ల నిండా మెహందీ ఉండాల్సిందే. ఆ డిజైన్లను చూసుకుంటూ మురిసిపోతుంటారు. పెండ్లిళ్లు, శారీ ఫంక్షన్లు, ఇతరత్రా వేడుకల్లో మెహందీ ఆర్టిస్టుల స్టాల్స్ కనిపిస్తుంటాయి. సిటీలోనూ మెహందీ ఆర్టిస్టులకు  డిమాండ్​పెరుగుతోంది. క్రియేటివిటీ, ఓపికతో కూడుకున్నఈ  పనిని చాలా మంది ఉపాధిగా మలుచుకుంటున్నారు. యూట్యూబ్, ఇంటర్నెట్​లో, మెహందీ పుస్తకాలను చూస్తూ కొందరు డిజైన్లు వేయడం నేర్చుకుంటుండగా.. మరికొందరు అనుభవం ఉన్న వారి దగ్గర కోర్సు నేర్చుకుని మరీ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మగవాళ్లు సైతం నేర్చుకుని ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తున్నారు. దీంతో సిటీలో మేల్ ఆర్టిస్టుల సంఖ్య బాగా పెరిగింది.  

హైదరాబాద్, వెలుగు : 

అన్ని రకాల డిజైన్లపై పట్టు.. 

మెహందీ రకాల్లో ఇండియన్, అరబిక్, ఇండో అరబిక్, మోరోకాన్, గ్లిట్టర్, బ్రైడల్, బ్యాంగిల్ స్టైల్,  ఇక్సో టెక్ మెహందీ, సింగిల్ ఫింగర్ డిక్షన్, ఫ్యాబ్ ట్రెండీ మెహందీతో పాటు వివిధ రకాల డిజైన్లు ఉన్నాయి. ఒక్క చేతికి మెహందీ నిండుగా వేయాలంటే గంటన్నర నుంచి 2 గంటల టైమ్ పడుతుంది. మెహందీ వేయడం కాస్త ఓపికతో కూడున్న పనే అయినా ఆదాయం కూడా ఎక్కువే ఉంటుందని ఆర్టిస్టులు చెబుతున్నారు. ఒక్క చేతికి సింగిల్ ఫింగర్ డిజైన్​కు రూ.500ల నుంచి ధర ప్రారంభమవుతోంది. సగం చేతికి డిజైన్​ని బట్టి రూ.వెయ్యి నుంచి చార్జి చేస్తున్నారు. ఇక పెండ్లి కూతురికి మెహందీ వేయాలంటే రూ.5 వేల నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నారు. పేరున్న ఆర్టిస్టులు ఇంకా ఎక్కువగానే చార్జి చేస్తున్నారు. స్టూడియోల్లో పనిచేసేవారికి నెలకు రూ.25వేల పైనే జీతం ఉంటోంది. ఇక్కడి ఆర్టిస్టులకు బయటి నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి.

ప్రతిరోజూ కొత్త డిజైన్స్​ ట్రై చేస్తుంటా..

నాకు డ్రాయింగ్ వేయడమంటే ఇష్టం. అలా మెహందీ వేయడం కూడా నేర్చుకున్నా. ప్రస్తుతం మెహందీ కమ్ ట్యాటూ ఆర్టిస్టుగా వర్క్ చేస్తున్నా. మెహందీలో చాలా డిజైన్స్ ఉంటాయి. ప్రతిరోజు కొత్త డిజైన్స్ ​ట్రై చేస్తుంటా.     

- అర్వింద్, మెహందీ ఆర్టిస్ట్, శరత్ సిటీ మాల్, కొండాపూర్‌‌‌‌