ఈ షరతులను ఉల్లంఘిస్తే ఆర్యన్ బెయిల్ రద్దే

ఈ షరతులను ఉల్లంఘిస్తే ఆర్యన్ బెయిల్ రద్దే

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్‌షా తనయుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకూ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆర్యన్ ఎప్పుడు విడుదలవుతాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ.. కోర్టు నుంచి ఇంకా ఉత్తర్వులు రాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇకపోతే, బెయిల్ ఇచ్చినప్పటికీ ఆర్యన్‌కు కోర్టు పలు షరతులు విధించింది. ఆ కండీషన్లు ఏంటో తెలుసుకుందాం.. 

  • ఆర్యన్‌కు బెయిల్ వచ్చినప్పటికీ పోలీసులకు చెప్పకుండా అతడు ముంబైని విడిచి వెళ్లడానికి వీల్లేదు. అలాగే ప్రతి శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముందు అతడు తప్పకుండా హాజరవ్వాలి. 
  •  బెయిల్ ఉత్తర్వుల ప్రకారం ఆర్యన్ పర్సనల్ బాండ్ కింద కోర్టుకు లక్ష రూపాయలు చెల్లించాలి. 
  • డ్రగ్స్ కేసులో తనతోపాటు అరెస్ట్ అయిన మిగిలిన నిందితులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్యన్ కాంటాక్ట్‌లో ఉండకూడదు. ఈ కేసుతో సంబంధం ఉన్న  ఇతరులతోనూ టచ్‌లో ఉండొద్దు. 
  • ఈ కేసులో సాక్షాలను ప్రభావితం చేయకూడదు. అలాగే ఆధారాలను ధ్వంసం చేయకూడదు.  
  • పాస్‌పోర్ట్‌ను స్పెషల్ కోర్టు ఎదుట వెంటనే సరెండర్ చేయాలి. 
  • ఈ కేసులో తుది తీర్పు వెల్లడించేంత వరకు దీని గురించి మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా)లో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. 
  • స్పెషల్ జడ్జి పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. 
  •  గ్రేటర్ ముంబైని దాటి బయటకు వెళ్లాలంటే ఈ కేసులో విచారణ చేస్తున్న అధికారికి సమాచారం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్న విషయాన్ని ఆఫీసర్‌కు తెలియజేయాలి. 
  • కోర్టుకు తప్పకుండా హాజరవ్వాలి.
  • ఎన్‌సీబీ అధికారులు విచారణకు పిలిచినప్పుడు తప్పనిసరిగా వెళ్లాలి. 
  • కోర్టులో విచారణ మొదలైన తర్వాత ట్రయల్స్‌ను ఆలస్యం చేసేందుకు ప్రయత్నించొద్దు. ఈ రూల్స్‌లో దేన్నయినా అతిక్రమిస్తే ఎన్‌సీబీ బెయిల్ రద్దు చేయాలని స్పెషల్ జడ్జిని కోరొచ్చు. 

మరిన్ని వార్తల కోసం: 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

ఇదెక్కడి న్యాయం.. కేటీఆర్‌కు అనసూయ ట్వీట్ 

కళ్లు దానం చేసిన పునీత్ రాజ్‌కుమార్