కళ్లు దానం చేసిన పునీత్ రాజ్‌కుమార్

కళ్లు దానం చేసిన పునీత్ రాజ్‌కుమార్

గుండె పోటుతో కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్  కళ్లను  దానం చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో  పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా  ఆయన కళ్లను మరొకరి కోసం దానం చేశారు కుటుంబ సభ్యులు. ఇవాళ ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చేరిన పునీత్ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పు ఫ్యాన్స్  విక్రమ్ ఆస్పత్రికి  క్యూ కట్టారు. కర్ణాటక ప్రభుత్వం థియేటర్లన్నీ మూసేయాలని ఆదేశించింది. కర్ణాటకలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో రాణించాడు. బాల నటుడిగా 12 సినిమాల్లో కనిపించిన రాజ్ కుమార్. బెట్టడా హూవు సినిమాకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. అప్పు సినిమాతో హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రాజ్ కుమార్. హీరోగా 32 సినిమాల్లో నటించాడు. వీటిలో 10కి పైగా సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి. దీన్నీ బట్టి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా తెలుగు సినిమాలను కన్నడలోకి రీమేక్ చేశారు రాజ్ కుమార్. ఆంధ్రావాలా, ఒక్కడు, దూకుడు కన్నడ రీమేక్ లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.