
యూఎస్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ వేసుకున్న దుస్తులకు ఇండియాతో కనెక్షన్ ఉంది. ఒకప్పటి ఫ్యాషన్ మోడల్ మెలానియా.. ఇండియా టూర్లో వైట్జంప్సూట్లో కనిపించారు. వైట్ జంప్ సూట్‌కు గ్రీన్ శాష్ వన్నె తెచ్చింది. గ్రీన్ శాష్ (నడుము భాగంలో బెల్టులా చుట్టినట్టుండే డిజైన్ క్లాత్) మెలానియా డిజైనర్ హెర్వ్ పియర్ స్పెషల్‌గా తయారు చేశారు. ఈ శాష్ ఇండియన్ టెక్స్‌టైల్స్‌తో తయారుచేసినట్లు పియర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ఆకుపచ్చ, బంగారపు రంగుల్లో మెరుస్తున్న ఈ శాష్ తయారీకి అరుదైన కాస్ట్లీ క్లాత్వాడినట్లు చెప్పారు. తన ఫ్రెండ్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇండియన్ టెక్స్ టైల్ డాక్యుమెంట్ల సాయంతో ఈ శాష్ డిజైన్ చేశానని పియర్ వివరించారు.
అప్పుడు..ఇప్పుడు అదే డ్రెస్
ఇవాంకా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు. ప్లేన్ దిగగానే తన స్టన్నింగ్ ఔట్ఫిట్తో అందరినీ కట్టిపడేసింది ఇవాంకా. ప్రోఎన్జా షౌలర్ బ్రాండ్‌కు చెందిన బేబీ బ్లూ, రెడ్ కలర్ ఫ్లోరల్ డ్రెస్‌ను వేసుకుంది. ఈ డ్రెస్ ఖరీదు రూ.1.71 లక్షలు. ఇవాంకా ఈ డ్రెస్ వేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అర్జెంటీనా టూర్ సమయంలో కూడా ఇదే డ్రెస్‌తో ఆమె కనిపించింది. సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్లీ వేసుకోరు అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఈ డ్రెస్ వేసుకోవడం ద్వారా అలాంటి అభిప్రాయాలు తప్పని ఇవాంకా నిరూపించింది. తన రెండో ఇండియా టూర్లో ఇవాంకా ఇంకెన్ని సర్ప్రైజ్లు ఇస్తుందో చూడాలి.
see this – తమ్ముడు ఇంతపని చేస్తావనుకోలేదు..అభిమానిపై కేటీఆర్ సీరియస్
అమ్మో ఈ గడుగ్గాయికి ఎంతకోపమో.. నెట్టింట్లో వైరల్ బేబీ
గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్..మేనల్లుడిపై కేసు నమోదు