గన్నేరువరంలో విదేశీ పక్షుల సందడి 

గన్నేరువరంలో విదేశీ పక్షుల సందడి 

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్ద కొన్ని రోజులుగా  విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వేసవి సమయంలో విదేశాల నుంచి పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. సూర్యాస్తమయం అనంతరం చెరువు వద్ద ఉన్న చెట్ల పొదల్లో నివాసం ఉంటాయి. విదేశీ పక్షులను చూసేందుకు వివిధ గ్రామాల నుంచి తరలివస్తున్నారు.